వారణాసి: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత వాయిదా సొమ్ము 20 వేల కోట్ల రూపాయల నిధులను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విడుదల చేశారు. లోక్సభ ఎన్నికలైన తర్వాత తొలిసారిగా ప్రధాని వారణాసిని సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కిసాన్ సమ్మాన్ సమ్మేళనంలో 9.26 కోట్ల మంది రైతులు లబ్ధి చేకూరే నిధులను నేరుగా వారి ఖాతాల్లోకి విడుదల చేశారు.