అహ్మదాబాద్: రీల్ కోసం చేసిన స్టంట్ బెడిసికొట్టింది. దీంతో ఒక వాహనం అదుపుతప్పింది. కాలువలోకి దూసుకెళ్లింది. (SUV Plunges Into Canal) అందులో ఉన్న ఇద్దరు యువకులు మరణించారు. మరో యువకుడు ఆ కాలువలో గల్లంతయ్యాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ సంఘటన జరిగింది. మార్చి 5న కొందరు యువకులు వాస్నా బ్రిడ్జి సమీపంలో సోషల్ మీడియా రీల్ కోసం స్టంట్ చేశారు. ఎస్యూవీ వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు.
కాగా, కాలువలోకి దిగిన యువకులను రోప్ సహాయంతో వాహనం లాగే రీల్ స్టంట్ కోసం ఆ యువకులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా వాహనంతో యూ టర్న్ తీసుకునేందుకు యత్నించారు. అయితే వాహనాన్ని డ్రైవ్ చేసిన యువకుడు నియంత్రణ కోల్పోయాడు. బ్రేక్ వేయడానికి బదులు యాక్సిల్రేటర్ను రైజ్ చేశాడు. దీంతో ఆ వాహనం వేగంగా కాలువలోకి దూసుకెళ్లింది.
మరోవైపు కాలువ గట్టు వద్ద ఉన్న మిగతా యువకులు ఇది చూసి షాక్ అయ్యారు. కాలువలోకి దూసుకెళ్లిన వాహనంలో ఉన్న వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే వాహనంలో ఉన్న ఇద్దరు యువకులు ఈ ప్రమాదంలో మరణించారు. మృతులను యష్ సోలంకి, యక్ష్ భంకోడియాగా గుర్తించారు. వాహనాన్ని డ్రైవ్ చేసిన మైనర్ యువకుడి పక్క సీటులో కూర్చొన్న క్రిష్ దవే ఆ కాలువలో గల్లంతయ్యాడు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఆ కాలువ వద్దకు చేరుకున్నారు. అందులోకి దూసుకెళ్లిన వాహనం, మృతులను బయటకు తెచ్చారు. గల్లంతైన యువకుడి కోసం ఆ కాలువలో గాలిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
3 Young Men Drowned After Car Plunges into Canal During Social Media Reel Filming in Ahmedabadhttps://t.co/MSF9XGKd9d pic.twitter.com/6HfcA4BET2
— DeshGujarat (@DeshGujarat) March 6, 2025