Potato Smuggling | కోల్కతా: అక్రమార్కులకు ఐడియాలు బోలెడు. ‘పుష్ప’ సినిమాలో పాల క్యానుల్లో ఎర్ర చందనం దుంగలను స్మగ్లింగ్ చేసినట్లు చూపించారు. పశ్చిమ బెంగాల్ అక్రమార్కులు కూడా సినిమా చిట్కాలను అనుసరిస్తున్నారు.
బంగాళ దుంపలను పశువుల మేత ముసుగులో ఇతర రాష్ర్టాలకు తరలిస్తున్నారు. ఆలుగడ్డల ధరలు పెరిగిపోతుండటంతో ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఈ నిషేధాన్ని పట్టించుకోకుండా వ్యాపారులు రకరకాల పన్నాగాలతో వాటిని ఎగుమతి చేస్తున్నారు. డుబుర్దిహి చెక్ పోస్ట్ వద్ద పశువుల మేతతో వెళ్తున్న ఓ లారీని పోలీసులు తనిఖీ చేయగా లారీలో బంగాళ దుంపలు కనిపించాయి.