PM Modi | ఆ రాగి శాసనాలు భారత్‌కు గర్వకారణం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PM Modi | భారత అథ్లెట్ (India Athlete) గుర్విందర్ సింగ్ (Gurvinder Singh) పై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narnedra Modi) ప్రశంసలు కురిపించారు. రాంచీ (Ranchi) లో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల గురించి ఆదివారం మన్‌కీ బాత్ (Mann Ki Baat) 134వ ఎపిసోడ్లో ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
PM Modi : భారత అథ్లెట్ (India Athlete) గుర్విందర్ సింగ్ (Gurvinder Singh) పై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narnedra Modi) ప్రశంసలు కురిపించారు. రాంచీ (Ranchi) లో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల గురించి ఆదివారం మన్‌కీ బాత్ (Mann Ki Baat) 134వ ఎపిసోడ్లో ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. వందమీటర్ల పరుగులో రికార్డులు సృష్టించిన అథ్లెట్లు గుర్విందర్, అనిమేష్ (Animesh) తో ఆయన నేరుగా మాట్లాడారు. కేవలం రెండు రోజుల్లోనే 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయస్థాయిలో మూడు రికార్డులు సృష్టించామని మోదీ (PM Modi) అన్నారు.
ఈ అద్భుతమైన ఘనత సాధించిన ఇద్దరు అథ్లెట్లు గుర్విందర్ సింగ్, అనిమేష్‌కు అభినందనలు తెలిపారు. మోదీ పర్యటన సందర్భంగా ఇటీవల ‘అనైమంగళం’ రాగి శాసనాలను నెదర్లాండ్స్ ప్రభుత్వం భారత్‌కు తిరిగి అప్పగించింది. ఇది భారతీయులు గర్వించదగిన విషయమని మోదీ అన్నారు. ఇక, ఉత్తరప్రదేశ్‌లోని ఓ కాలువలో చిక్కుకుపోయిన డాల్ఫిన్‌ను కొందరు దాదాపు 13 గంటలపాటు శ్రమించి రక్షించారు. దీనికి సంబంచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ప్రధాని మోదీ ఈ సంఘటనను కూడా మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు.
గంటలపాటు శ్రమించి డాల్ఫిన్‌ను కాపాడిన వారిని అభినందించారు. ఈ సహాయక చర్యల్లో కేంద్రం ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన డాల్ఫిన్ అంబుల్స్ కీలకపాత్ర పోషించినట్లు తెలిపారు. కేరళలోని ఆలువా ప్రాంతంలో స్విమ్మింగ్ క్లబ్ సేవలను మోదీ ప్రశంసించారు. ఈ క్లబ్ ద్వారా ఇప్పటి వరకు 15 వేల మందికి పైగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మోదీ పలు సూచనలు చేశారు. బయటకు వెళ్లాల్సి వస్తే తాగునీరు వెంట ఉంచుకోవాలన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఎండల నుంచి రక్షణ కోసం వాడే పానీయాలు మామిడి పండ్లు, మజ్జిగ, షర్బత్, బేల్పనా గురించి ఆయన ప్రస్తావించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

