ఒమిక్రాన్ కరోనా వేరియంట్‌తో ఇబ్బందులు పడుతున్న ఆఫ్రికా దేశాలకు తాము అండగా ఉంటామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఒమిక్రాన్ (Omicron)తో పోరులో ఆ దేశాలకు అవసరమైన వ్యాక్సిన్లు, తదితర వస్తువులన్నింటినీ పంపుతామని చెప్పింది. భారత్‌లో తయారు చేసిన వ్యాక్సిన్లు, అవసరమైన మెడిసిన్స్ పంపుతామని భారత్ తెలిపింది. కరోనా టెస్ట్ కిట్లు, గ్లవ్స్, పీపీఈ కిట్లు, మెడికల్ ఎక్విప్మెంట్.. ఇలా ఆ దేశాలకు అవసరమైన సామగ్రి మొత్తం పంపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.
ఆ దేశాల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. ఇప్పటికే బోత్సువానాకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ సరఫరా చేశామని, ఈ దేశాలకు మరింత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తమ సంసిద్ధతను బయటపెట్టింది. కాగా, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. దక్షిణాఫ్రికాలో బయటపడిన సంగతి తెలిసిందే. ఇది చాలా వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి.
In this regard, the Government has cleared all orders placed so far by COVAX for supplies of COVISHIELD vaccines including to African countries like Malawi, Ethiopia, Zambia, Mozambique, Guinea and Lesotho: Ministry of External Affairs (MEA)
— ANI (@ANI) November 29, 2021
Indian institutions would favourably consider cooperation in genomic surveillance and virus characterization-related research work with their African counterparts: Ministry of External Affairs (MEA)
— ANI (@ANI) November 29, 2021