న్యూఢిల్లీ: దాదాపు ఏడు వందల కోట్ల ఖర్చుతో చంద్రయాన్-3 ప్రాజెక్టును ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ మిషన్ కోసం ఖర్చు చేసిన బడ్జెట్‌ను ఓ నెటిజెన్ హాలీవుడ్ సినిమాతో పోల్చాడు. ఇంటర్స్టెల్లార్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతో చంద్రయాన్-3 మిషన్‌ను చేపట్టినట్లు ఓ నెటిజన్ అన్నాడు. ఒక మరో నెటిజెన్ ఆదిపురుష్ బడ్జెట్‌తో పోల్చాడు. ప్రభాస్, కీర్తి సనన్ నటించిన ఆదిపురుష్ సినిమా బడ్జెట్ కన్నా.. చంద్రయాన్-3 బడ్జెట్ తక్కువ అన్నట్లు కామెంట్ చేశారు. సోషల్ మీడియా ఎక్స్‌లో వైరల్ అవుతున్న ఆ పోస్టులపై బిలియనీర్ ఎలన్ మస్క్(Elon Musk) స్పందించారు. ఇది మంచి పరిణామమే అన్నట్లుగా ఆయన రియాక్ట్ అయ్యారు. గుడ్ ఫర్ ఇండియా అంటూ ఓ నెటిజన్ పోస్టుకు ఆయన కామెంట్ జోడించారు.
Good for India 🇮🇳!
— Elon Musk (@elonmusk) August 22, 2023
ఇంటర్స్టెల్లార్ చిత్ర నిర్మాణం కోసం దాదాపు 1200 కోట్లు ఖర్చు చేశారు. ఇక ఆదిపురుష్ కోసం 700 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.