న్యూఢిల్లీ: రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో(ఆర్ అండ్ డీ) ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రూ.1 లక్ష కోట్ల మూల నిధితో రిసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్(ఆర్డీఐ) స్కీముకు కేంద్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. మరోవైపు ఉద్యోగాల కల్పనకు ఈఎల్ఐ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టనుంది.
ఈపీఎఫ్ఓ నడిపే సామాజిక భద్రతా పథకాల ద్వారా రానున్న రెండేండ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలు సృష్టించేందుకు రూ.1.07 లక్షల కోట్లతో ఉపాధితో ముడిపడిన ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) పథకానికి కేంద్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది.