ముంబై : ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఇవాళ ఆర్బీఐ గవర్నర్(RBI Governor) సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. రెపో రేటుపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ఆయన వెల్లడించారు. దీంతో గృహరుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. రెపో రేటును 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. రెపో రేటు తగ్గించడం వల్ల .. బ్యాంకులపై రుణభారం తగ్గనున్నది.
దీని వవల్ల బ్యాంకులు కూడా కస్టమర్లకు తక్కువ రేటుకే వడ్డీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా రుణాలపై ఈఎంఐలు తగ్గే ఛాన్సు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రెపో రేటను 6 శాతానికి తగ్గించాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా తెలిపారు.
Monetary Policy Statement by Shri Sanjay Malhotra, RBI Governor- April 09, 2025, 10 am https://t.co/0OCWkvfgc3
— ReserveBankOfIndia (@RBI) April 9, 2025