IAF Dinner Menu | భారత వైమానిక దళం (ఐఏఎఫ్) తన 93వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హిందన్ వేదికగా ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన డిన్నర్ మెనూ (IAF Dinner Menu) ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రశిబిరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. భారత్ దాడిలో 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఆ ఉగ్రశిబిరాల పేర్లతో ఐఏఎఫ్ డిన్నర్ మెనూను రూపొందించింది. అక్కడ వడ్డించిన మెయిన్ కోర్స్, డెజర్ట్స్కి రావల్పిండి చికెన్ టిక్కా (Rawalpindi Chicken Tikka), బహవల్పూర్ నాన్ (Bahawalpur Naan) వంటి పేర్లు పెట్టింది.
రావల్పిండి చికెన్ టిక్కా మసాలా
రఫీకి ర్రా మటన్
భోలారి పనీర్ మేతి మలై
సుక్కుర్ షామ్ సవేరా కోఫ్తా
సర్గోధా దాల్ మఖానీ
జాకోబాబాద్ మేవా పులావ్
బహవల్పూర్ నాన్
డెజర్ట్స్
బాలాకోట్ తిరమిసు
ముజఫరాబాద్ కుల్ఫీ ఫలూదా
మురిద్కే మీతా పాన్
Also Read..
Forbes List | ఫోర్బ్స్ కుబేరుల జాబితా.. మళ్లీ ముకేశ్ నంబర్-1
CJI Gavai | సీజేఐపై దాడికి యత్నం.. సుప్రీంకోర్టులోకి ఆ న్యాయవాది ఎంట్రీ రద్దు