Ration Card | న్యూఢిల్లీ: రేషన్ కార్డును అడ్రస్ ప్రూఫ్‌గా పరిగణించరాదం టూ ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. రే షన్ కార్డు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద లభించే సరుకులను తీసుకోవడానికి ఉద్దేశించింది మాత్రమేనని, దానిని చిరునామా, ఇంటి ధ్రువీకరణ పత్రంగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు గురువారం పేర్కొంది.
కత్పుట్లీ కాలనీ వాసుల పునరావాసం సందర్భంగా ఆ పథకం కింద లబ్ధి పొందడానికి పూర్వం అక్కడ నివసించినట్టు అడ్రస్ ప్రూఫ్‌గా రేషన్‌కార్డును సమర్పించాలంటూ అధికారులు వి ధించిన నిబంధనను సవాల్ చేస్తూ కొందరు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.