Rastrpati Bhavan : ఇవాళ్టి (బుధవారం) నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్రపతి భవన్లోకి సందర్శకులకు అనుమతి లేదు. ఈ మేరకు రాష్ట్రపతిభవన్ ఒక ప్రకటన చేసింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో త్వరలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది.
కొత్త ప్రభుత్వం కొలువుదీరే ప్రక్రియ రాష్ట్రపతి భవన్లోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలోనే జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర నూతన మంత్రిమండలి ప్రమాణస్వీకారం కోసం రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రపతిభవన్లోకి సందర్శకులకు అనుమతి నిరాకరించారు.