White Python | కర్నాటకలో అరుదైన తెల్ల కొండ చిలువ ప్రత్యక్షమైంది. కార్వాన్ జిల్లా మిర్జాన్‌లోని రాంనగర్లో నివాసమంటున్న సుబ్రహ్మణ్య నాయక్ అనే వ్యక్తి ఇంట్లో కొండ చిలువ కనిపించింది. సాధారణ కొండచిలువల కన్నా భిన్నంగా ఉన్న ఈ తెల్లని రంగులో ఉన్న కొండ చిలువను చూసి స్థానికులు అయోమయానికి గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేహిక్ క్యాచర్ పవన్ నాయక్‌కు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. తెల్లని కొండ చిలువ అని నిర్ధారించారు. మెలనిన్ లోపం కారణంగా పాము చర్మం తెల్లగా మారుతుందని.. దీన్ని ‘అల్బినో స్నేక్’గా పిలుస్తారని పవన్ నాయక్ పేర్కొన్నారు. కొండచిలువను పట్టుకొని సురక్షిత ప్రాంతంలో దాన్ని వదిలేశారు. ఇదిలా ఉండగా.. ఇంతకు ముందు కర్నాకట శివమొగ్గ జిల్లాలో రెండుసార్లు శ్వేతనాగు కనిపించింది.