తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్): భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు 20 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఏఎఫ్సీ అండర్-20 ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించింది. క్వాలిఫయర్స్ ఈవెంట్ గ్రూప్-బీలో రెండో స్థానం దక్కించుకొని మెయిన్ టోర్నీ బెర్తు సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఆఖరి పోరులో భారత్ 3-0తో బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించింది.
డ్యానీ మైతే (25వ నిమిషంలో), విశాల్ యాదవ్ (60వ ని), మహమ్మద్ అర్బాష్ (79వ ని) తలో గోల్‌తో జట్టును గెలిపించారు. భారత్ మూడు మ్యాచ్‌ల్లో ఆరు పాయింట్లు అందుకుంది. మరో మ్యాచ్‌లో ఆతిథ్య ఉజ్బెకిస్థాన్ 2-0తో సిరియాను ఓడించింది. ఫలితంగా గ్రూప్-బీలో రెండో స్థానంలో నిలిచిన భారత కుర్రాళ్లు ముందంజ వేశారు. భారత్ చివరగా 2006లో ప్రధాన టోర్నీలో ఆడింది.