Rare Sun Halo | ఆకాశంలో అరుదైన అద్భుతం… సూర్యుడి చుట్టూ రంగురంగుల వెలుగు వలయం.. వీడియో
Rare Sun Halo | ఇవాళ సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా ఆకాశంలో అత్యంత అరుదైన అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుడి చుట్టూ ఒక వెలుగుల వలయం (Sun Halo) ఏర్పడింది.
న్యూఢిల్లీ: ఇవాళ సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా ఆకాశంలో అత్యంత అరుదైన అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుడి చుట్టూ ఒక రంగురంగుల వెలుగు వలయం (Sun Halo) ఏర్పడింది. ఇంద్ర ధనస్సులో ఉండే రంగులతో ఏర్పడిన ఈ వలయం చూడముచ్చటగా కనిపించింది. ఢిల్లీ వాసులు ఆసక్తిగా ఆ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఆపై వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అత్యంత అరుదైన ఈ సన్ హాలో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
కాగా, మేఘాల్లోని షట్భుజాకార మంచు స్ఫటికాల గుండా సూర్య కిరణాలు వంగి ప్రయాణించడంవల్ల ఇలాంటి వలయాలు ఏర్పడుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. శాస్త్రపరిభాషలో వీటినే 22 డిగ్రీ హాలోస్ అని కూడా అంటారని వెల్లడించారు. సాధారణంగా భూమికి 8 నుంచి 10 కిలోమీటర్ల ఎత్తులో ఇలాంటి వలయాలు ఏర్పడుతాయని చెప్పారు. కాగా, సూర్యుడి చుట్టూ ఇలాంటి వలయాకారం ఏర్పడటం అశుభమని కొందరు చెబుతున్నారు. కానీ అవి ఒట్టి పుకార్లేనని సైంటిస్టులు కొట్టిపారేస్తున్నారు.
A #halo can be observed around sun right now from #Delhi.Go outside and watch it now#DelhiRains pic.twitter.com/Ppu7R6I9ez
— m n (@mn11107373) May 27, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

