Rare Baviri Fish | నిలబడే చేపను చూశారా.. ఇదిగో మత్స్యకారుల వలకు చిక్కింది!
Rare Baviri Fish | విశాఖపట్నం నగరంలోని సాగర్‌నగర్ ఇస్కాన్ కేంద్రం సమీపంలోగల సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. ఈ చేప చూడటానికి చాలా వింతగా ఉంది.
విశాఖపట్నం: విశాఖపట్నం నగరంలోని సాగర్‌నగర్ ఇస్కాన్ కేంద్రం సమీపంలోగల సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. ఈ చేప చూడటానికి చాలా వింతగా ఉంది. ఈ చేప కడుపు కింద రెండు, వీపు పైన ఒక ముల్లు ఉన్నాయి. కడుపు కింద బోర్లించిన V ఆకారంలో ఉన్న ముళ్లపై చేప నిలబడి ఉంది. దీనికి ప్రత్యేకంగా మూడు ముళ్లు ఉండటంతో దీన్ని మూడు ముళ్ల చేప అని అంటున్నారు.
అయితే, అత్యంత అరుదుగా కనిపించే ఈ చేపలను బవిరి చేపలు అంటారని ఏపీ మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పీ శ్రీనివాసరావు చెప్పారు. సముద్ర జలాల్లో చాలా లోపల సంచరించే ఈ బవిరి చేపలు అత్యంత అరుదుగా పైకి వస్తాయని ఆయన తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చలికాలంలో పైకి వచ్చే క్రమంలో ఇలా వలలకు చిక్కుతాయని ఆయన వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

