బెంగళూరు: ఫేక్ యాప్‌తో ర్యాపిడో డ్రైవర్లు జనాన్ని మోసం చేస్తున్నారంటూ ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగ్రత్తగా ఉండాలంటూ సోషల్‌మీడియాలో ప్రజలను హెచ్చరించారు. దీనిపై స్పందించిన ర్యాపిడో కంపెనీ బాధ్యుడైన సదరు డ్రైవర్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది.
మీనల్ గోయల్ లింక్డిన్, ఇన్స్టాగ్రామ్ పోస్టులపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. ‘కొత్తరకం ర్యాపిడో స్కామ్ ఇది! బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి మా ఇంటికి క్యాబ్ బుక్ చేసుకున్నా. ఇంటి వద్దకు చేరుకున్నాక.. నా మొబైల్లోని ర్యాపిడో యాప్‌లో రూ.532 ధర చూపించింది. సదరు డ్రైవర్ మాత్రం రూ.650 చార్జ్ అయ్యిందంటూ, ధర చూపించాడు’ అని గోయల్ వివరించారు. అనుమానంతో పరిశీలిస్తే క్యాబ్ డ్రైవర్ ఫేక్ ర్యాపిడో యాప్‌ను వాడుతున్నట్టు తేలిందన్నారు.