న్యూయార్క్ : ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రభావశీలుర జాబితాలో బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ చోటు దక్కించున్నారు. ఈ ఏడాదికి గానూ 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాను టైమ్ మ్యాగజైన్ బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా, యూట్యూబ్ చీఫ్ నీల్ మోహన్, న్యూయార్క్ సిటీ మేయర్ మమ్దానీ కూడా చోటు దక్కించుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పోప్ లియో, అమెరికా విదేశాంగ మంత్రి రూబియో, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు కూడా చోటు దక్కింది.