రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసు.. ఎన్ఐఏ అదుపులో బీజేపీ కార్యకర్త
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన దర్యాప్తులో మరో ముందడుగు పడింది. ఈ కేసులో ఇద్దరు అనుమానితులతో సంబంధాలున్న బీజేపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.
బెంగళూరు: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన దర్యాప్తులో మరో ముందడుగు పడింది. ఈ కేసులో ఇద్దరు అనుమానితులతో సంబంధాలున్న బీజేపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. కేసు దర్యాప్తులో భాగంగా గత వారం శివమొగ్గలో ఎన్ఐఏ దాడులు జరిపింది. ఓ మొబైల్ స్టోర్‌తో సహా ఇద్దరు అనుమానితుల ఇండ్లలో సోదాలు జరిపింది. మొబైల్ స్టోర్ ఉద్యోగులను విచారించగా బీజేపీ కార్యకర్త సాయిప్రసాద్ పేరు బయటకు వచ్చిందని ఎన్ఐఏ వర్గాలు శుక్రవారం తెలిపాయి.
బీజేపీ కార్యకర్త అరెస్ట్ కావటంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ నాయకుడు దినేశ్ గుండూరావు ఎక్స్ వేదికగా బీజేపీని నిలదీశారు. మీ పార్టీ కార్యకర్త అరెస్ట్‌పై మీరేం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. పేలుళ్లలో బీజేపీ ప్రమేయం ఉన్నట్టు అర్థమవుతున్నదని ఆయన అన్నారు. మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడులో పది మంది గాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

