Loksabha Elections 2024 : ఎన్డీయే భాగస్వామ్య పార్టీ ఏ ఒక్కటీ విపక్ష ఇండియా కూటమి వైపు వెళ్లదని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. బిహార్ సీఎం నితీష్ కుమార్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలని ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎంపీల సంఖ్య 272 కాగా తమకు 292 మంది సభ్యుల బలం ఉందని గుర్తుచేశారు. తమ భాగస్వామ్య పార్టీ ఏ ఒక్కటీ ఇతర కూటమి వైపు మళ్లదని అన్నారు. చంద్రబాబు, నితీష్ కుమార్ సహా అందరినీ కలుపుకుని ముందుకెళతామని స్పష్టం చేశారు.
ప్రధాని నివాసంలో బుధవారం జరిగే ఎన్డీయే భేటీలో భాగస్వామ్య పార్టీలు ప్రధాని మోదీకి మద్దతు పలుకుతాయని అన్నారు. ప్రధాని మోదీకి మద్దతుగా కేంద్ర క్యాబినెట్ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఎన్డీయే భేటీలోనూ తాము ప్రధాని పదవికి మోదీ అభ్యర్ధిత్వానికి మద్దతు పలుకుతామని చెప్పారు. ఇక ఎన్డీయే సమావేశంలో ప్రధాని మోదీకి మద్దతుగా భాగస్వామ్య పార్టీలు లేఖలు అందచేశాయి.
Read More :
YS Jagan | ఫలితాలు చూసి ఆశ్చర్యపోయా.. మంచి చేసినా ఓడిపోయాం..!