న్యూఢిల్లీ: భారత్‌లో శనివారం నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైంది. జామా మసీదు ఇమామ్, లక్నోలోని షాహి ఇమామ్ దీనిని ధ్రువీకరించారు. దీంతో మన దేశంతోపాటు పాక్, బంగ్లాదేశ్‌లలోని ముస్లింలు కూడా ఆదివారం తొలి రోజా చేస్తారు.
వచ్చే నెలలో చంద్ర వంక దర్శనమివ్వడాన్ని బట్టి నెల ముగింపును నిర్ణయిస్తారు. సౌదీ అరేబియాలో శుక్రవారం రాత్రి చంద్ర వంక దర్శనమివ్వడంతో రంజాన్ మాసం ప్రారంభమైంది.