Dattareya Hosabale: అయోధ్యలో విరాళాల చోరీ దురదృష్టకరం: ఆర్ఎస్ఎస్
Dattareya Hosabale: అయోధ్యలోని రామాలయంలో విరాళాలను చోరీ చేసిన ఘటన దురదృష్టకరమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోస్బలే అన్నారు. హిందూ వర్గ ప్రజలు సంయనంతో ఉండాలని, క్లిష్ట పరిస్థితుల్లో ఓపికతో ఉండాలన్నారు. దర్యాప్తులో దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షించాలని హోస్బలే కోరారు.
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామాలయంలో విరాళాలను చోరీ చేసిన ఘటనపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోస్బలే(Dattareya Hosabale) స్పందించారు. ఆ ఘటన దురదృష్టకరమైందన్నారు. హిందూ వర్గ ప్రజలు సంయనంతో ఉండాలని, క్లిష్ట పరిస్థితుల్లో ఓపికతో ఉండాలని కోరారు. రామ్‌లల్లా గుడిలోని హుండీ బాక్సుల నుంచి చోరీ జరగడం దురదృష్టకరమని, ఆ ఘటన రాముడి భక్తులను, యావత్ సమాజ మనోభావాలను, భక్తిని గాయపరిచాయన్నారు. ఆ ఘటన తీవ్రంగా బాధపెట్టినట్లు ఆయన చెప్పారు. దర్యాప్తులో దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షించాలని హోస్బలే కోరారు. ఈ ఘటన ఆధారంగా హిందూ వ్యతిరేక శక్తులు.. హిందూ ధర్మాన్ని కించపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఆ కుట్రలను చేధించేందుకు హిందూ సమాజం ఓపికతో ఉండాలని అన్నారు.
#WATCH | RSS General Secretary Dattatreya Hosabale says, “…The unfortunate incident of theft from the donation boxes placed in the Shri Ram Lalla Temple in Ayodhya has wounded the sentiments and reverence of the entire society and Ram devotees, and we are all hurt by this… pic.twitter.com/hEOk3J2w4g
— ANI (@ANI) July 3, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

