శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 26, 2020 , 19:03:57

రాఖీల‌తోపాటు.. క‌రోనా జాగ్ర‌త్త‌లు

రాఖీల‌తోపాటు.. క‌రోనా జాగ్ర‌త్త‌లు

అహ్మ‌దాబాద్‌: రాఖీలు త‌యారు చేసి విక్ర‌యించే వ్యాపారులు ఈసారి విభిన్నంగా వాటిని త‌యారు చేస్తున్నారు. క‌రోనా నేప‌థ్యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను కూడా సూచిస్తున్నారు. గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్‌లో రాఖీలు త‌యారు చేసే వ్యాపారులు ఈసారి క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించే స‌మాచారం, జాగ్ర‌త్త‌ల‌తో కూడిన సందేశాల‌ను రాఖీల‌తో క‌లిపి ప్యాకింగ్ చేశారు. క‌రోనా వైర‌స్ ప‌ట్ల ప్ర‌‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించే స‌మాచారంతోపాటు రాఖీల‌ను ప్యాక్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. 


logo