న్యూఢిల్లీ: దేశంలో జన్యుమార్పిడి (జీఎం) విత్తనాలపై పూర్తిగా నిషేధం విధించాలని కోరుతూ ప్రధాని మోదీకి రైతు నేత రాకేశ్ టికాయత్ లేఖ రాశారు. జన్యు పరివర్తన చెందిన పంటలు పర్యావరణంతోపాటు ప్రజారోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బీటీ (బాసిల్లియస్ తురింజియెన్సిస్)పత్తిని దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు.జీఎం పంటలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ అక్రమంగా అవి దేశంలోకి వచ్చి చేరుతున్నాయని పేర్కొన్నారు. సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే అవి దేశంలోకి చొరబడుతున్నాయని విమర్శించారు.
వీటి కారణంగా జాతీయ జీవ భద్రతకు పెనుముప్పు వాటిల్లుతుందన్నారు. జ న్యు మార్పిడి పంటలు క్యాన్సర్, చర్మ సంబంధ సమస్యలతో పాటు పశువులు, పరపరాగ సంపర్కం పైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు.