న్యూఢిల్లీ : భారతీయ కిసాన్ యూనియన్ (BKU) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయిత్‌ను ఘాజీపూర్ సరిహద్దుల్లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రైతు నేతను ఆదివారం మధ్యాహ్నం అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయనతో పాటు పలువురిని సైతం అదుపులోకి తీసుకున్నారు. నిరుద్యోగుల ధర్నాలో పాల్గొనేందుకు రాకేశ్ తికాయిత్ జంతర్ మంతర్ వద్దకు వెళ్తున్నట్లు సమాచారం అందడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ విషయాన్ని ముజఫర్‌నగర్‌లోని బీకేఐయూ జిల్లా అధ్యక్షుడు యోగేశ్ శర్మ మాట్లాడుతూ ఢిల్లీ పోలీసులు తికాయిత్‌ను అదుపులోకి తీసుకున్నారన్నారు. అదే సమయంలో పశ్చిమ యూపీలోని కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యూపీలోని ముజఫనగర్లో శనివారం జరిగిన రైతుల ధర్నాలో రాకేశ్ టికాయిత్ లఖింపూర్‌లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, దోషి అయిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
యూపీలో విద్యుత్ ఖరీదు ఎక్కువని, బావికి మీటర్ బిగిస్తే.. తొలగించి కేంద్రానికి పంపాలని రైతులకు సూచించారు. అధికారులు బీజేపీకి ఏజెంట్లుగా పని చేస్తున్నారని నరేశ్ తికాయిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించడంతో పాటు అరెస్టు చేయాలని, మద్దతు ధర హామీ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ స్కీమ్‌ను వెనక్కి తీసుకోవాలని, అమరవీరుల రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్నారు.