న్యూఢిల్లీ: యూపీలోని సీతాపూర్ కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్‌ను ఓ రేప్ కేసులో గురువారం అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. యూపీ కాంగ్రెస్ యూనిట్ జనరల్ సెక్రటరీ అయిన రాథోడ్ పత్రికా సమావేశం నిర్వహిస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
రాథోడ్ తనను నాలుగేండ్లుగా లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళ ఈ నెల 17న ఫిర్యాదు చేసింది. తనను పెండ్లి చేసుకొంటానని, రాజకీయాల్లో మంచి కెరీర్ కల్పిస్తానని చెప్పి రాథోడ్ తనను మోసగించారని ఆమె ఆరోపించారు.