ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలన్న ఖర్గే.. కుదరదన్న వెంకయ్య

న్యూఢిల్లీ: 12 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. వార్షాకాల సమావేశాల్లో చివరి రోజు 12 మంది రాజ్యసభ ఎంపీలు అనుచితంగా వ్యవహరించింది. అయితే వారిని శీతాకాల సమావేశాల్లో పూర్తిగా సస్పెండ్ చేశారు. దీనిపై ఇవాళ రాజ్యసభలో చర్చ జరిగింది. 12 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతున్నామని మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. వర్షాకాల సమావేశాల్లో జరిగిన ఘటనపై ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. దీనిపై చైర్మన్ వెంకయ్య రియాక్ట్ అయ్యారు. వర్షాకాల సమావేశాల్లో ఎదురైన చేదు అనుభవాలు ఇంకా వెంటాడుతున్నాయన్నారు. రభస సృష్టించిన ఎంపీలపై చర్యలు తీసుకునే హక్కు చైర్మన్కు ఉందని వెంకయ్యనాయుడు తెలిపారు. సస్పెన్షన్ ఎత్తివేత అభ్యర్ధనను తిరస్కరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సస్పెన్షన్ ఎత్తివేతను తిరస్కరించడంతో.. విపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

