న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఈ ఏడాది రాజ్యసభ నుంచి రిటైర్ కానున్న 68 మంది ఎంపీలకు చైర్మన్ జగ్దీప్ ధన్కర్ ఘనంగా వీడ్కోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు సభ్యులు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. వీరి రిటైర్ కారణంగా సభలో కొంత వెలితి కనిపిస్తున్నదని చెప్పారు.
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన పార్లమెంటరీ వ్యవస్థలో భాగస్వాములైన వీరందరి పేరు చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. రిటైరవుతున్న వారిలో పలువురు కేంద్రమంత్రులు ఉన్నారు.