ముంబై, జూలై 5 (నమస్తే తెలంగాణ): మళ్లీ కలిసి ఉండేందుకే ఒకే వేదికపైకి వచ్చామని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే శనివారం చెప్పారు. ‘మరాఠీ గళం’ విజయోత్సవ సభలో ఆయన తన సోదరుడు, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చాలా సంవత్సరాల తర్వాత, రాజ్, నేను ఒకే రాజకీయ వేదికపై కలిశాం.
మా మధ్య ఉన్న అంతరాలను అనాజీ పంత్ (దేవేంద్ర ఫడ్నవీస్) తొలగించారు’ అని స్పష్టం చేశారు. రాజ్ మాట్లాడుతూ.. 20 సంవత్సరాల తర్వాత తామిద్దరం కలిసి వస్తున్నామని చెప్పారు. మరాఠీ ఒకటే తమ ఇద్దరి ఎజెండా అని చెప్పారు. ప్రాథమిక పాఠశాలల్లో మూడో భాషగా హిందీని బోధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై ఠాక్రే సోదరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.