Rajnath Singh | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో ఇటీవలే వరుస ఉగ్రదాడి ఘటనలు (Terror Attacks) చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ఆందోళన వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్లో టెర్రరిస్టుల దాడులు దురదృష్టకరమని (unfortunate) అన్నారు. సరిహద్దుల్లో ఎలాంటి భద్రతా లోపం లేదని.. ఉగ్రవాదులకు భద్రతా దళాలు తగిన సమాధానం ఇస్తున్నాయని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో విలేకరులతో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘జమ్ము కశ్మీర్లో ఉగ్రదాడులు దురదృష్టకరం. ఇది భద్రతా లోపాల సమస్య కాదు. గతంతో పోలిస్తే దాడులు తగ్గాయి. మన భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఉగ్రదాడులను ధీటుగా ఎదుర్కొంటున్నాం. ఇప్పటికే ఎంతో మంది ఉగ్రవాదులను మట్టుపెట్టాం. జమ్ము కశ్మీర్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అతి త్వరలోనే అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
కాగా, జమ్ము కశ్మీర్లో శుక్రవారం నుంచి మూడు మూడు ఎన్ కౌంటర్లు జరిగాయి. శ్రీనగర్‌లోని ఖన్యార్(Kanyar), బందిపొరాలోని పన్నెర్(panner), అనంత్‌నాగ్ (Ananthanag)లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది.
Also Read..
Encounter | అనంత్‌నాగ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Encounter | జమ్ము కశ్మీర్లో ఎదురు కాల్పులు.. ఖాన్యార్ ప్రాంతంలో తుపాకుల మోత
Israel | హమాస్‌కు కోలుకోలేని దెబ్బ.. ఐడీఎఫ్ దాడుల్లో పొలిటికల్ బ్యూరో చీఫ్ హతం