Encounter | జమ్ము కశ్మీర్లో (Jammu And Kashmir) ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా అనంత్‌నాగ్ (Anantnag) జిల్లాలో శనివారం ఉదయం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇద్దరు ఉగ్రవాదులను (terrorists) భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో హల్కన్ గలి ప్రాంతంలో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులకు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Chinar Corps, Indian Army tweets, “Based on specific input, a Joint Operation was launched by Indian Army, Jammu and Kashmir Police & Srinagar Sector CRPF in gen area Halkan Gali, Anantnag. On 02 Nov 2024, suspicious movement near Halkan Gali was observed and challenged by… pic.twitter.com/mwoaDgkEDH
— ANI (@ANI) November 2, 2024
కాగా, కశ్మీర్ లోయలో శుక్రవారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన చేసిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు కార్మికులు చనిపోగా.. ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని శ్రీనగర్‌లోని జేవీసీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల కోసం తీవ్రంగా గాలింపు చేపడుతున్నారు.
ఖాన్యార్ ప్రాంతంలో తుపాకుల మోత
మరోవైపు శనివారం ఉదయం నుంచి శ్రీనగర్ (Srinagar)లోని ఖాన్యార్ (Khanyar) ప్రాంతంలో తుపాకుల మోత మోగుతోంది. ఇక్కడ ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. శుక్రవారం యూపీకి చెందిన ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా ఆ ప్రాంతంలో కార్డన్‌సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భారత దళాలు.. వారిపై ఎదురు కాల్పులకు దిగారు. ప్రస్తుతం అక్కడ ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకూ ఇరువైపులా ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు నివేదికలు లేవని వెల్లడించారు.
#WATCH | J&K: Heavy firing in the Khanyar area of Srinagar as security forces conducted cordon and search operations. More details awaited
(Visuals deferred by unspecified time) pic.twitter.com/GuxSjTHyCb
— ANI (@ANI) November 2, 2024
Also Read..
Elon Musk | ఎక్స్ ఉద్యోగులకు షాకిచ్చిన మస్క్.. ఇంజినీరింగ్ విభాగంలో లేఆఫ్స్
Air Pollution | ఢిల్లీలో దారుణంగా వాయు నాణ్యత.. ఆస్తమా, కళ్ల మంటలతో ఇబ్బంది పడుతున్న నగర వాసులు
Us Elections | అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి.. ఇప్పటికే ఓటేసిన 6 కోట్ల మంది