Elon Musk | ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం సంకేతాల నేపథ్యంలో దాదాపు అన్ని సంస్థలు (tech industry) తమ ఉద్యోగుల్ని ఎడాపెడా పీకేసిన విషయం తెలిసిందే. చిన్నా, పెద్ద కంపెనీలన్న తేడా లేకుండా అన్ని సంస్థలూ ఉగ్యోలకు లేఆఫ్స్ ప్రకటించాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. విడతల వారీగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. తాజాగా బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) ఆధీనంలోని మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది (Lays Off Employees From X).
నవంబర్ 5న జరగున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ను ప్రమోట్ చేయడంలో బిజీగాఉన్న మస్క్.. తన ఎక్స్ ప్లాట్ఫామ్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలిసింది. తాజా రౌండ్లో ఎక్స్‌లోని ఇంజినీరింగ్ విభాగం (Engineering Department) ఉద్యోగులను తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నది ఇంకా స్పష్టత రాలేదని సదరు నివేదిక తెలిపింది. రెండు నెలల క్రితం కంపెనీకి సంబంధించిన విషయాలపై ఉద్యోగులకు ఓ పేజీ నివేదిక ఇవ్వాలని ఎక్స్ కోరింది. దాని ఆధారంగా ఉద్వాసన పలికినట్లు సదరు నివేదిక పేర్కొంది. ఉద్యోగులకు మెయిల్స్ ద్వారా లేఆఫ్స్ సమాచారం అందించినట్లు తెలిసింది. అయితే, ఈ తాజా లేఆఫ్స్‌ఫై ఎక్స్ బహిరంగంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
Also Read..
Air Pollution | ఢిల్లీలో దారుణంగా వాయు నాణ్యత.. ఆస్తమా, కళ్ల మంటలతో ఇబ్బంది పడుతున్న నగర వాసులు
Bomb Threat | సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపులు.. భయాందోళనలో ప్రయాణికులు
Us Elections | అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి.. ఇప్పటికే ఓటేసిన 6 కోట్ల మంది