Encounter | జమ్ము కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా ఉగ్రవాదులు (terrorists), భద్రతా బలగాల (security forces) మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా శనివారం కూడా జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్ (Heavy firing) మొదలైంది.
శ్రీనగర్ (Srinagar)లోని ఖాన్యార్ (Khanyar) ప్రాంతంలో తుపాకుల మోత మోగుతోంది. ఇక్కడ ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. శుక్రవారం యూపీకి చెందిన ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా ఆ ప్రాంతంలో కార్డన్‌సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భారత దళాలు.. వారిపై ఎదురు కాల్పులకు దిగారు. ప్రస్తుతం అక్కడ ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకూ ఇరువైపులా ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు నివేదికలు లేవని వెల్లడించారు.
#WATCH | J&K: Heavy firing in the Khanyar area of Srinagar as security forces conducted cordon and search operations. More details awaited
(Visuals deferred by unspecified time) pic.twitter.com/GuxSjTHyCb
— ANI (@ANI) November 2, 2024
Also Read..
Us Elections | అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి.. ఇప్పటికే ఓటేసిన 6 కోట్ల మంది
Spain floods | 200 దాటిన స్పెయిన్ వరద మృతుల సంఖ్య.. వాలెన్సియాలోనే అత్యధికం