Israel | ఇజ్రాయెల్‌తో యుద్ధంలో హమాస్‌కు దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే ఆ సంస్థ చీఫ్ యహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ దళాలు అంతమొందించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సంస్థ పొలిటికల్ బ్యూరో చీఫ్ (Hamas political bureau chief) ఇజ్ అల్-దిన్ కసబ్ (Izz al-Din Kassab)ను కూడా ఐడీఎఫ్ హతమార్చింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (Israel Defence Forces) తాజాగా ధ్రువీకరించింది.
హమాస్ పొలిటికల్ బ్యూరోలో నేషనల్ రిలేషన్స్ హెడ్‌గా కసబ్ వ్యవహరిస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. తాము జరిపిన వైమానికి దాడుల్లో కసబ్‌తోపాటు ఆయన సహాయకుడు అయ్మన్ అయేష్ కూడా హతమైనట్టు పేర్కొంది. మరోవైపు కసబ్ మృతిని హమాస్ కూడా ధ్రువీకరించింది. ఆయనతోపాటు మరో అధికారి కూడా మరణించినట్టు తెలిపింది. అయితే, ఐడీఎఫ్ చెబుతున్నట్టు కసబ్ హమాస్‌లో అత్యధిక ర్యాంకులో లేడని.. స్థానిక గ్రూపు అధికారి మాత్రమేనని స్పష్టం చేసింది.
తూర్పు లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్.. 52 మంది దుర్మణం
ఇజ్రాయెల్-హెజ్బొల్లాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తూర్పు లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ వైమానిక దాడుల్లో 52 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 72 మంది గాయపడ్డారు. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.
మరోవైపు హెజ్బొల్లా బలగాలు కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 11 మంది గాయపడినట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. రెండేళ్ల క్రితం హమాస్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన పోరులో హెజ్బొల్లా తలదూర్చింది. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడటంతో.. ఇజ్రాయెల్ అటు గాజాలోని హమాస్‌తోపాటు, లెబనాన్‌లోని హెజ్బొల్లాతో యుద్ధం చేస్తోంది.
Also Read..
Israel attack | తూర్పు లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్.. 52 మంది దుర్మణం
Us Elections | అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి.. ఇప్పటికే ఓటేసిన 6 కోట్ల మంది
Kamala Harri | కమలా హారిస్ గెలుపుకై.. తమిళనాడులోని పూర్వీకుల గ్రామంలో పూజలు