న్యూఢిల్లీ: కశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట ఘటనపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విచారం వ్యక్తంచేశారు. తొక్కిసలాట కారణంగా జరిగిన విషాదం హృదయ విదారకంగా ఉందన్నారు. ప్రాణ నష్టం జరగడంపై ఆవేదన వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాని చెప్పారు.
The tragedy due to a stampede at Mata Vaishno Bhawan is heart-wrenching. Anguished by the loss of lives due to it. My condolences to the bereaved families in this sad hour. Praying for the speedy recovery of the injured.
— Rajnath Singh (@rajnathsingh) January 1, 2022
వైష్ణోదేవి ఆలయ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన విషయాలను ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు. జమ్ములోని వైష్టోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 13 మంది గాయపడ్డారని, వారంతా ప్రస్తుతం కత్రాలోని నారాయణ దవాఖానలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
Prime Minister Narendra Modi is monitoring the situation following a stampede at the Mata Vaishno Devi in Katra, Jammu. 13 injured people hospitalized in Narayana Hospital Katra: MoS Home Nityanand Rai to ANI
— ANI (@ANI) January 1, 2022
12 pilgrims have died during a stampede at Katra in Jammu
(File pic) pic.twitter.com/7IrDYcIGpl
తాను తక్షణమే ఘటనా స్థలానికి వెళ్తున్నానని కేంద్ర జితేంద్ర సింగ్ తెలిపారు. తొక్కిసలాటకు దారితీసిన విషయాలపై స్థానిక అధికారులతో చర్చించి ప్రధానికి వివరాలు తెలియజేస్తానని చెప్పారు.
I'm on my way to Katra. PM Modi is monitoring the situation following a stampede at the Mata Vaishno Devi in Katra, Jammu, and issued instructions to provide all possible medical aid & assistance to the injured: Union Minister Jitendra Singh to ANI
— ANI (@ANI) January 1, 2022
(File Pic) pic.twitter.com/0npN7OXWmd