Rajasthan | హైదరాబాద్, ఏప్రిల్ 6 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉండే రాజకోటల రాజధాని రాజస్థాన్‌లో ఈ నెలలోనే రెండు దఫాల్లో (19న, 26న) లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. 2004లో నాలుగు సీట్లకు పరిమితమైన కాంగ్రెస్.. 2009కి వచ్చేసరికి 20 స్థానాల్లో విజయదుందుభి మోగించింది.

అయితే, ఆ తర్వాత జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరువలేకపోయింది. ఇదే సమయంలో 2014, 2019లో దాదాపు అన్ని లోక్‌సభ స్థానాలను క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ.. హ్యాట్రిక్ విజయాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది.


