Highest Temperature : దేశవ్యాప్తంగా మార్చి నెలాఖరున ఉత్తర భారతదేశంలో ఎండలు దంచేస్తున్నాయి. మాడు పగిలిపోయేలా భానుడి భగభగలకు రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్ (Shri Ganga Nagar) పట్టణంలో ఏకంగా 48.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమైంది. తద్వారా మే 27 బుధవారం నాడు ప్రపంచంలోని అత్యంత వేడి ప్రదేశంగా గుర్తింపు ఈ పట్టణం సాధించింది. ఇదివరకు ఉత్తరప్రదేశ్‌లోని బండా(Banda)లో సైతం 48.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైన విషయం తెలిసిందే.
నైరుతి ఆలస్యంతో దేశంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. ఉత్తర భారతంలోని ఢిల్లీ, హరియణాలు సూర్యుడి ప్రతాపంతో జనం అల్లాడిపోతుండగా.. రాజస్థాన్‌లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. శ్రీగంగానగర్‌లో 48.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైందని రాజస్థాన్ వాతావరణ శాఖ తెలిపింది. మే 27 బుధవారం రోజున ప్రపచంలోనే అత్యంత వేడైన ప్రాంతంగా శ్రీగంగానగర్ రికార్డు పట్టేసిందని వెల్లడించింది.
Today Sriganganagar Recorded Second Highest Max Temp of this season in India.
Whereas before this 48.3°C recorded in Barmer on 12th May – Highest of this season.
5 out of the 10 hottest places in India are from Rajasthan today. pic.twitter.com/VuSeLZegEy
— Weatherman Rajasthan (@Rajsthanweather) May 27, 2026
భౌగోలిక స్వరూపం, పొడి ఎడారి గాలులు, వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఊరిలో ఎండ తీవ్రంగా కొట్టింది వాతావరణ శాఖ చెప్పింది. ఉత్తర రాజస్థాన్‌లో ఉండడం, భారత్ – పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉండడం వంటివి శ్రీగంగానగర్‌లో రికార్డు స్థాయిలో 48.2 డిగ్రీ ఉష్ణోగ్రత సాధ్యమైందని సమాచారం.
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ అనంతరం బికనీర్, రోహ్తక్లో రెండో అత్యధికంగా 46.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జైసల్మేర్, చురు ప్రాంతాల్లో 46.4 డిగ్రీల సెల్సియస్. హరియణాలోని హిస్సార్‌లో 46 డిగ్రీల సెల్సియస్.. న్యూ ఢిల్లీలో 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరుసటి రోజైన గురువారం కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్పింది. ఇసుక తుఫాన్లు, దుమ్ము తుఫాన్లు ఏర్పడే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.