(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : రోడ్లు బాగోలేవంటూ తనను నిలదీసిన సుమేర్పూర్ గ్రామస్థులపై రాజస్థాన్ పశుసంవర్ధక శాఖ మంత్రి జోరారామ్ , ఆయన అనుచరులు పగబట్టారు. గ్రామానికి కరెంటు, నీటి సరఫరాను కట్ చేశారు. తన సొంత నియోజకవర్గంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి మంత్రి వెళ్లినప్పుడు తమ గ్రామానికి రోడ్లు బాగోలేవని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరమ్మతులు చేయించాలని భావనా గ్రామస్థులు మంత్రిని డిమాండ్ చేశారు.
ఆ తర్వాత ఆదివారం తమ ఇండ్లకు కరెంట్, నీటి సరఫరాను కట్ చేశారని పలువురు గ్రామస్థులు ఆరోపించారు. హామీలను నెరవేర్చాలని అడిగితే, మంత్రి ఇలాంటి పనులు చేయడమేంటని మండిపడ్డారు.