జైపూర్, : నూతన సంవత్సరం వేళ రాజస్థాన్‌లో పెను ముప్పు తప్పింది. ఢిల్లీలో నవంబర్ 10న జరిగిన పేలుడు ఘటనలో ఉపయోగించిన పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్‌ను రాజస్థాన్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. టోంక్ జిల్లాలో ఓ వాహనం నుంచి 150 కిలోల అమ్మోనియం నైట్రేట్‌తోపాటు పేలుడుకు ఉపయోగించే ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
నిందితులను బుండి జిల్లాకు చెందిన సురేంద్ర పట్వా, సురేంద్ర మోచీగా గుర్తించారు. బరోనీ పోలీసు స్టేషన్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా మారుతీ సియాజ్ కారులో 150 కిలోల అమ్మోనియం నైట్రేట్ లభించింది.