సీకర్ : నీట్-యూజీ రద్దు కారణంగా తీవ్ర ఆవేదనకు లోనైన రాజస్థాన్‌లోని సీకర్‌కు చెందిన ప్రదీప్ మేఘ్వాల్(22) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే రితిక్ అనే నీట్ విద్యార్థి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ప్రదీప్ సీకర్‌లోని ఒక అద్దె గదిలో ఉంటూ నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడని పోలీసులు తెలిపారు.
ఉద్యోగ్ నగర్ ఎస్హెచ్ఓ రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ప్రదీప్ తన సోదరి స్కార్ఫ్ సహాయంతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జరిగిన సమయంలో అతని సోదరి బాత్రూమ్లో ఉన్నది. బయటకు వచ్చి న ఆమె సోదరుడు ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించి, కిందకు దించింది. వెంటనే ఇంటి యజమానికి, పోలీసులకు సమాచారం అందించింది. మృతదేహాన్ని ఎస్కే దవాఖానకు తరలించామని ఇంకా పోస్ట్‌మార్టం నిర్వహించాల్సి ఉందని ఎస్‌హెచ్‌వో తెలిపారు.