Rajasthan Minister | ప్రాజెక్ట్‌లో రూ.1,140 కోట్లు నష్టం.. సొంత ప్రభుత్వంపై బీజేపీ మంత్రి ధ్వజం
Rajasthan Minister | ప్రభుత్వ ప్రాజెక్ట్‌లో రూ.1,140 కోట్ల నష్టం జరుగుతున్నదని బీజేపీ మంత్రి ఆరోపించారు. సొంత ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. ఆ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలని, ప్రతిపాదిత ఫైల్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జైపూర్: ప్రభుత్వ ప్రాజెక్ట్‌లో రూ.1,140 కోట్లు నష్టం జరుగుతున్నదని బీజేపీ మంత్రి ఆరోపించారు. సొంత ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. ఆ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలని, ప్రతిపాదిత ఫైల్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. (Rajasthan Minister) ఆరు నెలల కిందట బీజేపీ అధికారంలోకి వచ్చిన రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. సీఎం భజన్‌లాల్ శర్మ నిర్వహిస్తున్న హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్‌లో లోపాలపై వ్యవసాయ మంత్రి కిరోడి లాల్ మీనా ధ్వజమెత్తారు. గాంధీనగర్‌లో చేపట్టనున్న హౌసింగ్ ప్రాజెక్టు వల్ల ప్రభుత్వానికి రూ. 1,146 కోట్ల నష్టం వాటిల్లుతోందని అన్నారు. అక్కడి భూమి విలువను తక్కువగా పేర్కొనడం దీనికి కారణమని ఆరోపించారు.
కాగా, సీఎం ఆధ్వర్యంలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ), క్యాబినెట్ క్లియరెన్స్ లేకుండా ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్తున్నారని మంత్రి మీనా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ను ఆపివేయాలని, ఆ ఫైల్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం భజన్‌లాల్ శర్మకు ఈ మేరకు ఆయన లేఖ రాశారు.
మరోవైపు సొంత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీ మంత్రి మీనా అభ్యంతరం వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. గత నెలలో కూడా తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ కింద విక్రయించిన భూమిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందులో అవినీతి జరిగిందని ఆరోపించారు. స్పందించిన సీఎం ఆ ప్రాజెక్ట్‌పై చర్యలు తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

