మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 12:35:57

రాజస్థాన్‌ హైకోర్టులో సచిన్‌ పైలట్‌ పిటిషన్‌పై విచారణ

రాజస్థాన్‌ హైకోర్టులో సచిన్‌ పైలట్‌ పిటిషన్‌పై విచారణ

జైపూర్: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులను సవాలు చేస్తూ సచిన్ పైలట్, మరో 18 మంది అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై రాజస్థాన్‌ హైకోర్టులో విచారణ సోమవారం తిరిగి ప్రారంభమైంది. ఈ పిటిషన్‌ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి ఇంద్రజిత్ మహంతి, జస్టిస్ ప్రకాశ్‌ గుప్తా ధర్మాసనం విచారణకు స్వీరించిన విషయం తెలిసిందే.  అసెంబ్లీ స్పీకర్‌ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్ మను సింగ్వి తన వాదనలను సోమవారం వాదనలను ప్రారంభించారు. సచిన్‌ పైలట్‌, ఇతర ఎమ్మెల్యేల తరఫున సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌ సాల్వే, ముకుల్‌ రోహత్గీ ఇప్పటికే వాదనలు వినిపించారు. శుక్రవారం పైలట్, ఇతర తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మంగళవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశిస్తూ, కేసు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

గత వారం సోమ, మంగళవారాల్లో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (పార్టీ) సమావేశాలకు హాజరు కావాలని విప్‌ జారీ చేస్తే, శాసన సభ్యులు ధిక్కరించారని పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో నోటీసులు జారీ చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ 2 (1) (ఎ) పేరా కింద పైలట్,  ఇతర అసమ్మతి ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ చర్యలు తీసుకోవాలని కోరింది.  అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మాత్రమే విప్‌ వర్తిస్తుందని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదించారు.  ఎమ్మెల్యేలు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ సభ్యత్వాన్ని ‘స్వచ్ఛందంగా’ వదులుకుంటే అసెంబ్లీ వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు చేసిన తర్వాత రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ అధ్యక్షుడిగా సచిన్‌ను తప్పించిన విషయం తెలిసిందే.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo