అల్వార్: రాజస్థాన్(Rajasthan)లో బీజేపీ నేత జ్ఞాన్దేవ్ అహుజాపై వేటు పడింది. అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. షోకాజ్ నోటీసు కూడా అతనికి జారీ చేసింది పార్టీ. శ్రీరామ నవమి సందర్భంగా అల్వాల్‌లోని ఆలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ప్రోగ్రామ్‌కు కాంగ్రెస్ నేత టికారామ్ జుల్లీ హాజరయ్యారు. అయితే ఆయన వచ్చిన వెళ్లిన తర్వాత ఆలయాన్ని బీజేపీ అహుజా శుద్ధి చేశారు. బీజేపీ ఎంపీ, సీనియర్ నేత దామోదర్ అగర్వాల్ ఆ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఎంపీ తన నోటీసులో డిమాండ్ చేశౄరు. ఒవకేళ వివరణ ఇవ్వలేని పక్షంలో, క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు ఆ ఎంపీ చెప్పారు. ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న సమయంలో చేసిన ప్రమాణాలను ఉల్లంఘించినట్లు ఆ నోటీసులు తెలిపారు.
రాజస్థాన్ ప్రతిపక్ష నేత, మూడు సార్లు ఎమ్మెల్యే అయిన టికా రామ్ జుల్లీ ఆలయానికి వస్తే .. అప్పుడు ఆలయం అపవిత్రం అవుతుందని, దేవుడు అపవిత్రం అవుతాడని బీజేపీ నేత గతంలో ఆరోపించారు.అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే గుడికి వచ్చి వెళ్లిన తర్వాత బీజేపీ నేత ఆ ఆలయాన్ని గంగా జలంతో శుద్ధి చేశారు. బీజేపీ నేత కుల అహంకారాన్ని ప్రదర్శించినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తనకు వ్యక్తిగతంగా టిరా రామ్ జుల్లిపై ద్వేషం లేదని, కాంగ్రెస పార్టీ పట్ల వ్యతిరేకత ఉన్నట్లు బీజేపీ నేత వెల్లడించారు. రామసేతు అనేది కల్పన మాత్రమే అని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని, మరి అలాంటప్పుడు ఆలయానికి రావడం ఎందుకు అని బీజేపీ నేత ప్రశ్నించారు.