రాజస్థాన్‌లో వారాంతపు కర్ఫ్యూ.. 30 వరకు ప్రత్యక్ష క్లాసులు బంద్

జైపూర్: రాజస్థాన్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజా ఆంక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసింది. వారాంతపు కర్ఫ్యూ విధించింది. శనివారం రాత్రి 11 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఇది అమలులో ఉంటుందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న రాత్రి కర్ఫ్యూ కూడా కొనసాగుతుందని సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం పేర్కోంది.
మరోవైపు 12వ తరగతి వరకు అన్ని మున్సిపల్, కార్పొరేషన్ ప్రాంతాల్లో ప్రత్యక్ష బోధనను ఈ నెల 30 వరకు నిలిపివేశారు. అయితే ఆన్లైన్ శిక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మతపరమైన ప్రదేశాలు ఉదయం 5:00 నుండి రాత్రి 8:00 వరకు తెరిచి ఉంటాయని చెప్పారు.
రెస్టారెంట్లు, క్లబ్బులు 50 శాతం సామర్థ్యంతో రాత్రి 10:00 గంటల వరకు, సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు 50 శాతం కన్నా తక్కువ సామర్థ్యంతో రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని అధికారులు తెలిపారు. రాత్రి 8:00 గంటల వరకు వాణిజ్య సంస్థలు తెరిచి ఉంచేందుకు అనుమతించినట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

