న్యూఢిల్లీ : శిథిలావస్థలో ఉన్న చెత్త బోగీలతో కూడిన రైలును పంపిన భారతీయ రైల్వే అధికారులపై బీఎస్ఎఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమర్నాథ్ యాత్రకు భద్రత కల్పించడం కోసం సిబ్బందిని తరలించేందుకు వచ్చిన ప్రత్యేక రైలును బీఎస్ఎఫ్ బెటాలియన్ కమాండెంట్ తనిఖీ చేశారు.
దీనిలోని రెండు బోగీలు ప్రయాణానికి పనికిరావని గుర్తించారు. అగర్తల స్టేషన్ మాస్టర్‌కు ఈ విషయాన్ని లేఖ ద్వారా తెలిపారు. దీంతో ఆ రెండు బోగీలను మార్చారు. అనంతరం బీఎస్ఎఫ్ సిబ్బందితో ఆ రైలు జమ్ముకశ్మీరుకు 72 గంటలు ఆలస్యంగా బయల్దేరింది.