Railway Minister : ఇవాళ (సోమవారం) ఉదయం పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. అక్కడ సహాయక చర్యల్లో ఉన్న అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలం అంతటా తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని చెప్పారు. రైళ్ల రాకపోకల కోసం ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
ప్రమాదం జరిగిన మార్గం చాలా ప్రధానమైన మార్గమని, దాంతో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ప్రతిపక్షాలు ఈ ప్రమాదాన్ని రాజకీయం చేస్తున్నాయని, రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని అన్నారు. అనంతరం ఆయన సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీకి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
కాగా ఈ ఉదయం డార్జిలింగ్ జిల్లాలోని న్యూ జల్పాయ్గురి దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న కాంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్ రైలును ఓ గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 8 కి చేరింది. మరో 25 నుంచి 30 మంది తీవ్ర గాయాలతో సిలిగురిలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులకు కేంద్రం రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
#WATCH | Kanchenjunga Express train accident: Railways Minister Ashwini Vaishnaw visits North Bengal Medical College in Siliguri and meets the injured.
(Source: Railway CPRO) pic.twitter.com/cp1pg6tHZG
— ANI (@ANI) June 17, 2024