Ashwini Vaishnaw | గంటలో విజయవాడకు రెండు గంటల్లో చెన్నైకి.. తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రెయిన్స్
Ashwini Vaishnaw | దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం (Uniog Govt) ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న ఏడు బుల్లెట్ రైళ్లలో మూడు రూట్లు తెలంగాణకే దక్కాయి. ఇలా దక్కడం విశేషమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి (Railway Minister) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) వెల్లడించారు. ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రత్యేక శ్రద్ధ వల్లే రాష్ట్రానికి ఈ భారీ ప్రాజెక్టులు వచ్చాయని, రాబోయే రోజుల్లో తెలంగాణ (Telangana) దేశంలోనే ఒక పెద్ద బుల్లెట్ ట్రెయిన్ హబ్ (Bullet Train Hub) గా అవతరించబోతోందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
Ashwini Vaishnaw : దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం (Uniog Govt) ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న ఏడు బుల్లెట్ రైళ్లలో మూడు రూట్లు తెలంగాణకే దక్కాయి. ఇలా దక్కడం విశేషమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి (Railway Minister) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) వెల్లడించారు. ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రత్యేక శ్రద్ధ వల్లే రాష్ట్రానికి ఈ భారీ ప్రాజెక్టులు వచ్చాయని, రాబోయే రోజుల్లో తెలంగాణ (Telangana) దేశంలోనే ఒక పెద్ద బుల్లెట్ ట్రెయిన్ హబ్ (Bullet Train Hub) గా అవతరించబోతోందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
ఈ విప్లవాత్మక ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయాలు ఊహించని విధంగా తగ్గిపోతాయన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకు ఈ రైళ్లతో ప్రయాణ కష్టాలు పూర్తిగా తీరిపోనున్నాయి. బుల్లెట్ రైలు ఎక్కితే హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం ఒక గంట పది నిమిషాల్లోనే చేరుకోవచ్చని రైల్వే మంత్రి వివరించారు. అలాగే వ్యాపార రాజధాని ముంబైకి రెండు గంటల ఇరవై నిమిషాలు, చెన్నై నగరానికి కేవలం రెండు గంటల్లోనే దూసుకుపోవచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ దేశ రవాణా రంగంలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.
ఇదే గ్యాప్‌లో ఈ ప్రాజెక్టుల క్రెడిట్ కోసం కొందరు పాకులాడుతున్నారంటూ విపక్షాలపై మంత్రి మండిపడ్డారు. దీని పూర్తి క్రెడిట్ ప్రధాని మోదీకే దక్కుతుందని, గత యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్లో కేవలం రూ.800 కోట్లు మాత్రమే ఇస్తే.. తమ ప్రభుత్వం ఒక్క తెలంగాణకే ఏకంగా రూ.5000 కోట్ల రైల్వే నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. ఈ నిధుల వరద వల్లే రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయని స్పష్టంచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

