వడోదర: బయోమెట్రిక్‌లో కన్నుగప్పేందుకు చేసిన ప్రయత్నం వికటించింది. రైల్వేబోర్డు పరీక్షలో చీటింగ్ చేసేందుకు మిత్రుని వేలిముద్ర తగిలించుకు వచ్చిన నకిలీ అభ్యర్థి గుట్టు శానిటైజర్ వల్ల రట్టయింది.
వేడిపెనం మీద వేలిని ఆన్చినప్పుడు ఊడివచ్చిన చర్మాన్ని తగిలించుకొని వచ్చిన వ్యక్తిని అరెస్టు చేశారు. గుజరాత్‌లోని వడోదరలో గత 22న ఈ ఘటన జరిగింది. అసలు అభ్యర్థి మనీష్‌కుమార్, నకిలీ అభ్యర్థి రాజ్యగురు గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు.