కృష్ణకాలనీ, ఫిబ్రవరి 2 : గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణు లు పనిచేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సూచించారు. సోమవారం బీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా కార్యాలయంలో పార్టీ ఆశావహులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ వ్యక్తిగత అభిప్రాయాల కన్నా బీఆర్ఎస్ శ్రేయ స్సే ముఖ్యమన్నారు.
టికెట్ రాని వారు నిరాశ చెందకుండా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. బీఆర్ఎస్ హ యాంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. ప్రతి వార్డులో పార్టీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని పేరొన్నా రు. 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించేలా ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు.
ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి మున్సిపాలిటీ నిధులను తన సొంత మం డలం గణపురానికి తీసుకెళ్లిన విషయాన్ని ఇంటింటికి తెలియజేయాలన్నారు. వార్డుల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.