భోపాల్: కొందరు వ్యక్తులు రైల్వే స్టేషన్ బయట బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించారు. ఇది చూసి రైల్వే పోలీస్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. పబ్లిక్ ప్లేస్‌లో మద్యం తాగవద్దని మందలించాడు. ఆగ్రహించిన ఆ యువకులు రైల్వే పోలీస్‌ను కొట్టారు. (Railways cop beaten up) ఆయన యూనిఫామ్‌ను చించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రాణి కమలాపాటి రైల్వే స్టేషన్ బయట పార్క్ చేసిన కారులో కొందరు వ్యక్తులు మద్యం సేవించారు.
కాగా, గమనించిన ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ) అధికారి నాజర్ దౌలత్ ఖాన్ ఆ వ్యక్తులను మందలించారు. అక్కడ మద్యం తాగవద్దని చెప్పారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఇది ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో వాహనంలో ఉన్న రైల్వే పోలీస్ నాజర్ దౌలత్ ఖాన్‌పై వారు దాడి చేశారు. ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. యూనిఫామ్ చించారు. మరో ఇద్దరు రైల్వే పోలీసులు ఆ వ్యక్తులను వారించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
మరోవైపు దాడి తర్వాత రైల్వే పోలీస్ నాజర్ దౌలత్ ఖాన్ నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లారు. రైల్వే స్టేషన్‌లోని ఔట్‌పోస్టుకు చేరుకుని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. ఒక నిందితుడైన జితేంద్ర యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాగా, రైల్వే పోలీస్‌పై దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
🚨 At Bhopal’s Rani Kamlapati railway station, drunkards beat up a Muslim police officer after reading his name because he was stopping them from drinking alcohol in a public place.
Mohan Yadav Sir Now the law and order situation in Bhopal has also become Hindu-Muslim. pic.twitter.com/SRMiunZJOv
— Shruti Dhore (@ShrutiDhore) April 27, 2025