లక్నో, జూన్ 15: వారణాసి రైల్వే స్టేషన్ పార్కింగ్ స్టాండ్లలో అధిక చార్జీలతో ప్రయాణికులను పార్కింగ్ కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. 24 గంటల బైక్ పార్కింగ్ కోసం రూ.2,400 డిమాండ్ చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గంట సమయం పార్కింగ్‌కు మోటార్ సైకిల్‌కు రూ.100, సైకిల్‌కు రూ.50 వసూలు చేస్తున్నట్టు ‘అమర్ ఉజాలా’ వార్తా కథనం పేర్కొన్నది. దీనిపై దర్యాప్తు చేపట్టిన రైల్వే అధికారులు వారణాసి రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫామ్ వద్ద ఉన్న పార్కింగ్ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నట్టు ఆదివారం వెల్లడించారు.